భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టండని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పథకం పేరుతో ప్రజలను మోసం చేశారని, మహిళలకు 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి పథకంలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి మహిళా సోదరీమణులను మోసం చేశాడని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మారేపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జోరుక సదయ్య. మండల పార్టీ అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు చిట్యాల మాజీ చైర్మన్ కొడారి రమేష్, బొల్లెని రవీందర్ఎంపిటిసి నరహరి కల్పన-సుధాకర్ రెడ్డి. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ఆళ్ల మాధవరెడ్డి, బీఅర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టండి
