వీణవంక. (కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:బీఆర్ఎస్ లో చేరిన బీజేవైఎం మండల అధ్యక్షుడు నారాయణదాసు గోపీనాథ్ తో పాటు గ్రామానికి చెందిన 86 బూత్ అధ్యక్షులు గూడెపు శివ, ఉపాధ్యక్షుడు ఎదులాపురం రాము తదితరులు వాల బాలకిషన్ రావు ,స్థానిక సర్పంచ్ జ్యోతి రమేష్ , సవిత-మల్లయ్య ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలోకి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. గోపీనాథ్ మాట్లాడుతూ…ఎన్నో సంవత్సరాల నుంచి బిజెపిలో పని చేస్తున్నప్పటికీ ఈటెల రాజేందర్ చేరికతో పార్టీ వ్యవస్థ మొత్తం నాశనం అయింది. బిజెపిలో యువత ఎంత కమిట్మెంట్తో పని చేస్తున్నప్పటికీ పనులు పాత బీజేపీ కార్యకర్తలతో చేయించుకుంటూ పదవులకు గాని పైసలు వచ్చే పని గాని ఏదన్నా రాజేంద్ర తన వర్గానికి ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు పాత కార్యకర్తలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
మండలంలో కూడా నాయకత్వలోపం వల్ల కార్యకర్తలు బాగా ఇబ్బంది పడుతున్నారు. చల్లూరులో జరిగే అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి కౌశిక్ రెడ్డి నాయకత్వములో పనిచేయడానికి బీ ఆర్ఎస్ పార్టీ లో చేరడం జరుగిందనీ తెలిపారు.కౌశిక్ రెడ్డి గారి గెలుపుకోసం కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కుమార్ యాదవ్,వార్డు సభ్యులు దండి తిరుపతి,బొంగోని సదానందం,జీవన్,ఫసీయొద్దీన్,జక్కు నారాయణ,సంపత్ రెడ్డి,రాజయ్య,నాగిరెడ్డి మధుసూధన్ రెడ్డి, రాము,హరీష్, బార్గవ్,సది,రాము, కుమార్,శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.