లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి
ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ లక్షట్టిపెట్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ పార్టీనీ ఆదరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి లో పార్టీనీ బలోపేతం చేస్తామని తెలిపారు. ఒక వైపు నరేంద్ర మోడీ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు మరియు దేశ అభివృద్ధికి పని చేస్తూ ఉంటే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అక్రమ సంపాదన మరియు డబ్బు తో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. నరేంద్ర మోడీ పాలనను ప్రజలు అందరూ కోరుకుంటున్నారని దేశ అభివృద్ది మరియు సంక్షేమం మోదీతోనే సాధ్యం అని అన్నారు. ప్రజలు మోదీకి మద్దతు గా ఉన్నారని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ తప్పక విజయం సాధిస్తామని తెలిపారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ గెలుపే లక్ష్యం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి
