ఇరు పార్టీల నాయకులు ప్రచారంలో పెంచిన
దూకుడు !!
బిజెపిలో మాత్రం నాయకుని కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు,అభిమానులు!!
ధర్మపురి నేటి ధాత్రి
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ధర్మపురిలో గోమాస కోసం బిజెపి కార్యకర్తలు,అభిమానులు ఎదురు చూస్తున్నారు
ఇరు పార్టీల నాయకులు ప్రచారంలో దూకుడు పెంచిన ,నాయకులు వచ్చి వెళ్తున్న బిజెపిలో మాత్రం నాయకుని కోసం కార్యకర్తలు,అభిమానులు ఎదురు చూస్తున్నారు, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో, దేశమంతా ఒకవైపు మోడీ చరిష్మా వీస్తున్న తరుణంలో, ఇరువర్గాల పార్టీల నాయకులు కార్యకర్తలు, ఎవరికి వారి ప్రచార సభల్లో ఉపన్యాసాలతో దూకుడు పెంచుతున్నారు కాగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ధర్మపురి నియోజకవర్గంలో మాత్రం అక్కడక్కడ గ్రామాలలో కార్య కర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రం పార్టీ బి ఫాం అందుకున్న నాటి నుండి నామినేషన్ పర్వం ముగిసి,ప్రచారం ప్రారంబించిన తర్వాత బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కొరకు ఎదురుచూస్తున్నామని అభిమానులు ,కార్యకర్తలు చెపుతున్నారు,ఒకవైపు కాంగ్రెస్ మరో వైపు బీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచుతుంటే మరోవైపు మా బీజేపీ నాయకుడు నియోజక వర్గానికి ఒక్క సారి వచ్చి వెళితే నియోజకవర్గంలో మరింత ఉత్సాహంగా మేము కూడా దూకుడు పెంచుతామని, ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ,మరింత ఉత్సాహంగా ప్రచారం చేయ వలసి ఉందని,ఇప్పటికే కార్యకర్తలు గ్రామస్థాయిలో తమకు తోచిన విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నియోజక వర్గానికి ఒక్కసారి వచ్చి వెళ్తే , మోడీ చరిష్మా దేశమంతా వీస్తున్న ఈ క్రమంలో పార్టీ సమీకరణాలు మారి బిజెపి అభ్యర్థి వైపు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కార్యకర్తలు అభిమానులు అభిప్రాయ పడుతున్నారు,
ధర్మపురిలో గోమాస కోసం బిజెపి కార్యకర్తల ఎదురుచూపులు ?!!
