మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.
#రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపినే.
#ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పవనాలు.
#జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రానా ప్రతాపరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
దేశంలో దశాబ్ది కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థ వంతంగా పలు సంక్షేమ పథకాలు చేపడుతూ భారత దేశపు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి అండగా నిలవడానికి పలువురు బిజెపి పార్టీ వైపు చూస్తున్నారని
జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన విధానాన్ని గమనించి దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీల పరిపాలనపై విసిగిపోయిన ప్రజలు
రాష్ట్రానికి ప్రత్యామ్నయం బిజెపి పార్టీ అని భావించి నర్సంపేట నియోజకవర్గం లో భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలను మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బిజెపి జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేసే విధంగా కార్యకర్తలు నాయకులు అహర్నిశలు కృషి చేయాలని ఆయన అన్నారు.
పార్టీలో చేరిన వారు మాజీ వార్డ్ మెంబర్ గుంపుల రాజు, బిఆర్ఎస్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగరబోయిన సాగర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షు డు జక్కుల నరసింహ రాములు, మండల
కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎద్దునరేష్, తదితరులు వాటిలో చేరారు
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, నాయకులు ఊటుకూరి చిరంజీవి, బత్తిని కుమారస్వామి, కక్కెర్ల సమ్మయ్య, మురికి మనోహర్, దొమ్మటి శీను తదితరులు పాల్గొన్నారు.