బిఆర్ఎస్ లో చేరిన బిజెపి వార్డు మెంబెర్

పరకాల నేటిధాత్రి

హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు,వార్డు మెంబెర్ మునిగాల సంతోష్ రావు బుధవారం రోజున బీజేపీ పార్టీ కి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.అనంతరం ఎమ్మెల్యే వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సిలివేరు మొగిలి,మండల పార్టీ అధ్యక్షులు వైస్ ఎంపిపి చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి,ఉప సర్పంచ్ ఓడ్డేపల్లి సంపత్,రైతుబంధు కో ఆర్డినేటర్ మునిగాల విద్యాసాగర్ రావు,ఆముదాలపల్లి అశోక్ గౌడ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *