బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవై, మదురై ప్రాంతాల్లో అమలుకాకుండా అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.
కేంద్రప్రభుత్వం ప్రకటించిన మెట్రో రైలు పథకం కోవై, మదురై ప్రాంతాల్లో అమలుకాకుండా అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్‌ఆరోపించారు. తిరునల్వేలిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న నయినార్ నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ..
కోవై, మదురై ప్రాంతాల్లో మెట్రో రైలు పథకం అమలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా సీఎం స్టాలిన్(CM Stalin) అసత్యం మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కోవై, మదురై ప్రాంతాల్లో వచ్చే ఏడాది జూన్‌లోగా మెట్రో రైలు పథకం పనులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పకుండా ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
