బంగ్లాదేశ్‌లో భారీ భూ ప్రకంపనలు.. కోల్‌కతాలో కంపించిన భూమి..
బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 5.2 మాగ్నిట్యూడ్‌గా నమోదు అయింది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 10 గంటల 8 నిమిషాల ప్రాంతంలో ఘోరాశల్ దగ్గర భూప్రకంపనలు సంభవించాయి. యునైటెడ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. నార్సింగ్డికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇక, బంగ్లాదేశ్‌లో భూకంపం రావటంతో కోల్‌కతాతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
