
ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్, ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం
వ్యాపార కేంద్రమైన జమ్మికుంటలో రైలు హాల్టింగ్ సంతోషకరం
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
యశ్వంత్ పూర్ టు గోరక్ పూర్ ఎక్స్ ప్రెస్ ప్రప్రధమంగా హాల్టింగ్ తో వయా జమ్మికుంట వచ్చిన రైలుకు జమ్మికుంట బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముందుగా జమ్మికుంటలో రైల్ ఆగడానికి చొరవ తీసుకున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాపార కేంద్రమైన జమ్మికుంటలో యశ్వంత్పూర్ – గోరక్ పూర్ ఎక్సప్ర్రేస్ రైలు ఆగడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ విజ్ఝప్తికి రైల్వే శాఖ స్పందించి యశ్వంత్ పూర్ నుండి గోరక్ పూర్ వెళ్లే (12591 / 12592) ఎక్స్ ప్రెస్ రైలు ఇకపై జమ్మికుంటలో ఆగేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఎంపీ బండి సంజయ్ కుమార్ కలిసి వ్యాపార కేంద్రమైన జమ్మికుంటకు నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని అయితే పలు రైళ్లు ఇటువైపుగా వెళుతున్నప్పటికీ.. హాల్ట్ లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి రైలును జమ్మికుంటలో నిలిపేసే(స్టాపేజ్) అంశంపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలో యశ్వంత్ పూర్ – గోరక్ పూర్ ఎక్స్ ప్రెస్ ను జమ్మికుంటలో (స్టాపేజ్) నిలపాలని రైల్వే శాఖ జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ మరికొన్ని రైళ్లను జమ్మికుంటలో నిలపాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందని, విషయంలో సాధ్యాసాధ్యాలను రైల్వే శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు మాడ గౌతంరెడ్డి, జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, తూర్పటి రాజు, దొంతుల రాజ్ కుమార్, రాజేష్ ఠాకూర్, కైలాస్ కోటి గణేష్, మోడమ్ రాజు, రాకేష్ ఠాకూర్, బూరుగుపల్లి రాము, చైతన్యరెడ్డి, శిల జయప్రకాష్, మేక సుధాకర్ రెడ్డి, బచ్చు శివకుమార్, గుర్రం పరశురామ్, నగపురి విజయ్, యంసాని సమ్మయ్య, దేవులపల్లి నవీన్, కొండ్లే పాపయ్య, శనిగరపు తదితరులు పాల్గొన్నారు.