రామకృష్ణాపూర్ లో బిజెపి శ్రేణుల సంబరాలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ భారీ ఘనవిజయం సాధించడం పట్ల రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో పట్టణ బిజెపి పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాగూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచి, టపాసులు పేల్చే సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ముల్ల పోషం, పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ లు మాట్లాడుతూ…. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్ ,వైద్య శ్రీనివాస్, వేముల అశోక్, సంతోష్ రామ్ నాయక్, శ్రీనివాస్, ఓరుగంటి సాయి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!