
ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఉపాధ్యక్షులు నర్మట్ట శ్రీనివాస్
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని బిజెపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ఉపధ్యక్షులు నర్మెట్ట శ్రీనివాస్ హాజరయ్యారు.ఆయన సందర్బంగా మాట్లాడుతూ విశ్వగురువుగా భారత్ గా మారాలన్నా,వికసిత్ భారత్ సాకారం కావాలన్నా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని విశ్వగురువుగా భారత్ గా మారాలన్నా, వికసిత్ భారత్ సాకారం కావాలన్నా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని అవినీతికి ఆస్కారం లేని పాలన,అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చే బిజెపికి మరింత బలాన్ని ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు 2024 కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు.సభ్యత్వం నమోదు కోసం 8800002024 నంబర్ కి కాల్ చేస్తే వచ్చే లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు తెలియజేశారు.అభివృద్ధి,ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పని చేసే బిజెపికి అండగా ఉండేందుకు సభ్యత్వాన్ని స్వీకరించి,పార్టీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరడం ప్రతి బీజేపీ నాయకుల, కార్యకర్తల బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ గారు, కాచం గురు ప్రసాద్, రాష్ట్ర నాయకులు దేవనూరి మేఘనాథ్,జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సభ్యత్వ ప్రాముఖ్ ఆర్పి జయంతి లాల, సీనియర్ నాయకులు దగ్గు విజయేందర్ రావు,సిరంగి సతీష్ కుమార్,పావుశెట్టి శ్రీనివాస్,దంచనాదుల సత్యనారాయణ,పట్టణ ఉపాధ్యక్షులు నాగవెల్లి రంజిత్,సంఘ పురుషోత్తం, కోశాధికారి మంతెన సంతోష్ బూత్ అధ్యక్షులు సాదా మధుకర్,వీరేష్ బీరం రాజిరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.