
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఎంపీ కోటలో నిధులను మంజూరు చేశారని రామడుగు మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గుండి గోపాలరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక అధునాతనమైన అంబులెన్స్ కు ఎనిమిది లక్షల తొంబై వెల రూపాయలు, జాతీయ జెండా కోసం మూడు లక్షల రూపాయలు, గుండి గ్రామానికి హైమాస్ట్ లైట్ కు లక్ష రూపాయలు, శ్రీరాములపల్లి గ్రామానికి కులసంఘ భవనానికి ఐదు లక్షల రూపాయలు, దేశారాజుపల్లి గ్రామానికి రెండు హైమాస్ట్ లైట్లకు రెండు లక్షల రూపాయలు, వెలిచాల గ్రామానికి రెండు హైమాస్ట్ లైట్లకు రెండు లక్షల రూపాయలు, కమ్యూనిటీ భవనానికి మూడు లక్షల రూపాయలు, రామడుగు గ్రామానికి బోర్ పంపు కోసం మూడు లక్షల అరవైవేల రూపాయలు, సుమారు ఇరవై ఏడు లక్షల నిధులు ఎంపీ నిధులు విడుదల చేసారని తెలిపారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం అడగగానే నిధులు మంజూరు చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కి బీజేపీ నాయకులు, మండల ప్రజల తరపున, ఆయా గ్రామప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈపనులను తొందరలోనే ఎంపీ ప్రారంభిస్తారని ఒంటెల కరుణాకర్ రెడ్డి తెలిపారు.