
వనపర్తి నేటిధాత్రి :
హైదరాబాదులో బిజెపి కార్యాలయం పై కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ వనపర్తి పట్టణంలో రాజీవ్ చౌక్ లో జిల్లా పట్టణ బిజెపి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు .ఈ సందర్భంగా బిజెపి నేతలు వ మాట్లాడుతూ బిజెపి కార్యాలయం పై దాడి చేయడంపై ఖండించారు .బిజెపి నేతలు తలుచుకుంటే కాంగ్రెస్ వారు రోడ్లపై తిరగలేరని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . కాంగ్రెస్ నాయకులు తమ పద్ధతులు మార్చుకొని దాడులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు డి నారాయణ పట్టణ అధ్యక్షులు బచ్చురాం సీతారాములు చిత్తారి ప్రభాకర్ రాయన్నసాగర్ బిజెపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు