
BJP leaders protest
రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బిజెపి నాయకులు
కొద్దిపాటి వర్షానికే గుంతల మయమైన కొత్త పెల్లి భట్టుపల్లి రోడ్డు
నెలలు గడుస్తున్న పూర్తికాని రోడ్డు పనులు
కంకరపై ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
నేటి ధాత్రి అయినవోలు :-
వర్ధన్నపేట నియోజకవర్గంలో రోడ్డు విస్తరణలో భాగంగా మంజూరైన కొత్తపెళ్లి బట్టుపల్లి రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలల క్రితం రోడ్డు వెడల్పు లో భాగంగా కంకర పోసి వదిలేసిన అధికారులు ఇప్పటికీ తారు రోడ్డు పనులు పూర్తి చేయలేదని తద్వారా చిన్న వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిలిచి గుంతలు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాల గురవుతున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు. బుధవారం అయినవోలు భాజపా మండల పార్టీ అధ్యక్షుడు మాదాస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో రోడ్డుపై నిలిచిన బురద నీటిలో వరి నాట్లు వేయడం ద్వారా నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జి కోట కిరణ్, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్ , మహేష్, భరత్, శివమణి తదితరులు పాల్గొన్నారు.