
గణపురం సీఐని కలిసిన బీజేపీ నేతలు
గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ రావును బుధవారం మండల బిజెపి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సోమా దామోదర్, దుగ్గిశెట్టి పున్నం చందర్, మహిళా నాయకురాలు బొల్లం అరుణ, మండల ప్రధాన కార్యదర్శి చెలమల ప్రవీణ్, కోశాధికారి వడ్డెం రాజశేఖర్, బిల్లా దేవేందర్, రేపాక సంతోష్, భూక్యా హరిలాల్, దూడపాక సతీష్, సందీప్, దూడపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.