వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయాన్ని బిజెపి నాయకులు నీళ్లతో శుద్ధి చేశారు ఈనెల 22న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభ సందర్భంగా దేశంలో ప్రతి గుడిని శుద్ధి చేయాలని ఇందులో భాగంగా శ్రీరంగాపురం ఆలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజల సాకారం నెరవేరుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు న్యాయవాది మున్నూరు రవీందర్ జిల్లా బిజెపి అధ్యక్షులు ఎద్దుల రాజా వర్ధన్ రెడ్డి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం రామన్న గారి వెంకటేశ్వర రెడ్డి శ్రీనివాస్ గౌడ్ దాసోజు ప్రవీణ్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
రంగనాయక స్వామి దేవాలయమును శుద్ధి చేసిన బిజెపి నాయకులు
