BJP Slams Preventive Arrests in Ganapuram
ముందస్తు అరెస్టులతో బీజేపీ నాయకులను భయపెట్టలేరు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల నాయకుడు ఊర నవీన్ రావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముట్టడిని ఆపడానికి ముందస్తు అరెస్టు చేయడం సరికాదు 2023 లో తెలంగాణ రాష్ట్రము లో అధికారం లోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ లకు చట్ట బద్దత కల్పిస్తాం అని నమ్మబలికి అధికారం లోకి వచ్చాక 6 గ్యారెంటీ లను అమలు చేయడం లేదు అని భారతీయ జనతా పార్టీ ఈ రోజూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా ఈ కార్యక్రమం కి వెళ్లకుండా ఈ ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ లు చేయిస్తుంది బీజేపీ ఆధ్వర్యంలో ముందు ముందు ఇంకా ప్రజా సమస్య లపై 6 గ్యారెంటీ లను అమలు చేసే వరకు అలుపెరుగని పోరాటం చేస్తాం ఈ ముందుస్తూ అరెస్ట్ లతో బీజేపీ ని బయపెట్టలేరు
