పరకాల నేటిధాత్రి
వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కోసం సోమవారం రోజున పరకాల మండలంలోని నాగారం గ్రామంలో పరకాల మండల ఇన్చార్జి ఎర్రం రామన్న,పరకాల రూరల్ మండలం అధ్యక్షులు ముష్కే దేవేందర్ ఆధ్వర్యంలో బిజెపి పథకాల గురించి వివరించి కరపత్రాలు స్టిక్కర్స్ పంపిణీ పంచడం జరిగింది.అనంతరం కమలం గుర్తుకు అమూల్యమైన ఓటు వేయాలని ఆరూరి రమేష్ ను అధిక మెజారిటీ తో గెలిపంచాలని తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ ప్రబారి డాక్టర్ పెసర్ విజయచందర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సంతోష్ కుమార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారాయణ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురు ప్రసాద్,కట్టగాని శ్రీకాంత్,బిజెపి హన్మకొండ జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.