రైతుల హక్కుల కోసం బీజేపీ కిసాన్ మోర్చా పోరాటం

కాంగ్రెస్ హామీల విస్మరణపై రైతుల ఆగ్రహం

రుణమాఫీ కోసం రైతుల వినతి పత్రం

రైతు భరోసా అమలులో విఫలమైన ప్రభుత్వం

రైతుల పక్షాన బీజేపీ కిసాన్ మోర్చా వినతి

కామారెడ్డి జిల్లా /జుక్కల్ నేటి ధాత్రి:

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించి, గత 13 నెలలుగా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కినాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం రైతుల పక్షాన రైతులతో కలిసి జుక్కల్ తహశీల్దార్ కార్యాలయంలో గురువారం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రధానంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణ మాఫీని అధికారంలోకి రాగానే అనులు చేస్తామని చెప్పి సంవత్సర పాలన పూర్తయినా, నేటికీ 50శాతం మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం విచారకరం. విడతల వారీగా ఇప్పటి వరకు పాక్షికంగా రుణమాఫీ చేసి, సమగ్ర రుణమాఫీ చేశామని ప్రకటించడం విడ్డూరం.రైతు భరోసా పేరుతో ఎకరాకు ఖరీఫ్, రబీ కలుపుకుని ఏడాదికి రూ.15,000 ఇస్తామని మ్యానిఫెస్టోలో పేర్నొని నేటి వరకు ఖరీఫ్ కు విడుదల చేయాల్సిన పెట్టుబడి సాయాన్ని విడుదల చేయలేదు. రైతు భరోసా విషయంలో కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచిస్తున్నది. రైతు భరోసాను కౌలు రైతులకు సైతం వర్తింపచేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఇంతవరకు ఎటువంటి కార్యాచరణ చేయలేదు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12,000 ఇస్తామన్న ప్రభుత్వం ఆ ఊసే మరిచింది ఈ నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .ఇందులో కిసాన్ మోర్చా అధ్యక్షులు ఆనంద్, ఎస్సీ మోర్చా, కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ పటేల్, బీజేపీ నాయకులు గంగాధర్, శుభం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!