కమలనాధుడు ఈటెలే

https://epaper.netidhatri.com/view/322/netidhathri-e-paper-18th-july-2024%09

-త్వరలో బిజేపి ప్రకటన.

-బిజేపి జాతీయ నాయకత్వం ఈటెల వైపే మొగ్గు.

– ఉద్యమ నేపథ్యమే కలిసొచ్చిన అంశం.

-వివాద రహితుడుగా గుర్తింపు.

-మృధు స్వభావిగా అందరి మన్ననలు.

-జాతీయ అంశాల మీద అవగాహన వున్న నాయకుడు.

-అందరనీ కలుపుకుపోయే స్వభావం.

-విద్యార్థి, నిరుద్యోగులతో ఈటెలకు సత్సంబంధాలు.

-ఉద్యమకారులు గౌరవించే నాయకుడు.

-అన్ని వర్గాలలో అభిమానులున్నారు.

-కులాలకతీతంగా అభిమానించే వారున్నారు.

-జాతీయ స్థాయిలో బిజేపికి ఉత్తరాదిన గడ్డు పరిస్థితులు.

-దక్షణాదిన సార్వజనీన సమస్యలు.

-కేవలం హిందుత్వ ఎజెండాతో బైటపడే అవకాశం లేదు.

-కాంగ్రెస్‌ ను, బిఆర్‌ఎస్‌ను ఏక కాలంలో ఎదుర్కోవడం ఇతర నాయకుల వల్ల కాదు.

-ఈటెల సమకాలీన అంశాలపై లోతైన విశ్లేషణ చేయగలడు.

-మీడియా కూడా ఈటెలపై ఫోకస్‌ వుంటుంది.

 

హైదరాబాద్‌,నేధాత్రి: 

బిజేపి రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడుగా ఈటెల రాజేందర్‌ పేరు దాదాపు ఖరారైనట్లే. ఎప్పుడు ఈటెల పేరు ప్రకటిస్తారా? అన్నదే మిగిలి వుంది. గత కొంత కొంత కాలంగా పార్టీలో తీవ్ర తర్జన భర్జనల తర్వాత బిజేపి జాతీయ నాయకత్వం ఈటెల పేరును ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణ బిజేపి అధ్యక్ష విషయంలో ఈసారి తీవ్రమైన పోటీ ఎదురైంది. 2019 ఎన్నికల దాకా పెద్దగా బిజేపి అధ్యక్ష పదవికి తెలంగాణలో ప్రాదాన్యత లేదు. కాని 2023 ఎన్నికలు వచ్చే సరికి బిజేపి అధ్యక్ష పదవి అన్నది రాజకీయంగా ఒక గొప్ప అవకాశంగా మారింది. రాష్ట్రంలో బిజేపి రోజు రోజుకూ మరింత బలపడడమే అందుకు కారణం. పైగా కేంద్రంలో బిజేపి వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ప్రధానమంత్రి మోడీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే బలమైన నాయకుడుగా వున్నాడు. దేశ వ్యాప్తంగా బిజేపి ఎంతో శక్తివంతమైన పార్టీగా అవతరించింది. ప్రపంచంల ఏ పార్టీకి లేనంత కార్యకర్తలు బిజేపికి వున్నారు. సుమారు 14కోట్ల మంది కార్యకర్తలున్న ఏకైక పార్టీగా రికార్డులు సృష్టించింది. అలాంటి పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా భవిష్యత్తులో తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్న పార్టీ బిజేపి. అలాంటి పార్టీ అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ ఎదురైంది. ఈసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన ముఖ్యనేతలందరూ ఈ పదవికి పోటీ పడ్డారు. ముఖ్యంగా నిజామాబాద్‌ ఎంపి. అరవింద్‌ తీవ్ర ప్రయత్నం చేశారు. ఇక మెదక్‌ ఎంపి. రఘునందన్‌ రావు తీవ్రంగానే కృషి చేశారు. ఎంపి. డికే అరుణ కూడా అధ్యక్షపదవి కోసం పోటీ పడ్డారు. అయితే బిజేపి జాతీయ స్ధాయి నాయకత్వం ఈటెల వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈటెల కొత్త వ్యక్తి అనే ప్రచారాన్ని కూడా కొంత మంది నేతలు ఉదృతంగా ప్రచారం చేశారు. దాంతో ఈ విషయం జాతీయ స్ధాయి నేతలకు చేరింది. ఈ ప్రచారానికి చెక్‌ పెట్టేలా కేంద్ర నాయకత్వం కూడా స్పష్టనిచ్చి అందరి నోళ్లు మూయించింది. ఈటెల రాజేందర్‌ కొత్త బిజేపికి కొత్త నాయకుడు కాదని ప్రకటించింది. ఈ విషయాన్ని సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి ప్రకటించడంతో అందరి దృష్టి ఈటెల వైపు మళ్లింది. 

ఈటెలే ఈసారి బిజేపి తెలంగాణ అధ్యక్షుడన్న సంకేతాలు పంపినట్లైంది.

 ప్రయత్నాలు చేసేవారు కూడా విరమించుకోవచ్చన్న పరోక్ష సంకేతాలు వెళ్లినట్లైంది. దాంతో అందిరలోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి ఈటెల విషయంలో ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారా? అన్న చర్చ కొందరు చేస్తుంటే, ఈటెలే కాబోయే బిజేపి అధ్యక్షుడు అని తేల్చి చెప్పేందుకే కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారన్నది అర్ధమైంది. అయితే ఇక్కడ కూడా ఈటెల రాజేందర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంకా ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు. కాని అధిష్టానం ఈటెలను ఖరారు చేసినట్లు డిల్లీ వర్గాలనుంచి సమచారం అందుతోంది. గతంలో రెండు సార్లు ఎంపిగా ఎన్నికైన అరవంద్‌ మంత్రి పదవి ఆశించారు. కాని కరీంనగర్‌ ఎంపి. బండి సంజయ్‌ను వరించింది. దాంతో కనీసం అధ్యక్షపదవి అయినా దక్కుతుందనుకున్నారు. కాని సంకేతాలు మరోలా వున్నాయి. బండి సంజయ్‌ కంటే ముందు బిజేపి అధ్యక్షపదవి మెదక్‌ ఎంపి. రఘునందన్‌రావు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అప్పటికి రఘునందర్‌ రావు ఎమ్మెల్యే కూడా కాలేదు. అయినా అప్పటి అధిష్టానం రఘనందన్‌రావు పేరు పరిగణలోకి తీసుకున్నట్లు అప్పట్లో పెద్దగా వార్తలొచ్చాయి. ఇక రఘునందన్‌ పేరు ప్రకటించడమే తరువాయి అన్నంతగా 2020లో ప్రచార జరిగింది. కాని అప్పటికే కరీంనగర్‌ ఎంపిగా ఎన్నికైన బండి సంజయ్‌ పేరు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బండి సంజయ్‌ ఏమిటి? బిజేపి అధ్యక్షుడు ఏమిటి? అన్న చర్చ జోరుగా సాగింది. నవ్విన నాప చేనే పండుతుందన్నట్లు బండి సంజయ్‌ ఎంతో సమర్ధుడని తేలింది. ఆయన హయాంలో బిజేపి తెలంగాణలో ఎంతో బలపడిరది. ఈసారైనా అవకాశం వస్తుందని రఘునందన్‌ మరోసారి ఆశించారు. కాని ఈసారి కూడా ఆయనకు దక్కదన్న సంకేతాలు అందిన తర్వాత ఆయన కూడా సైటెంట్‌ అయ్యారు. ఈటెల రాజేందర్‌కు ఖరారౌతుందని తెలిసిన తర్వాత ఆయన ప్రయత్నం చేయడం కూడా మానుకున్నారని సమాచారం. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన నేత ఈటెల. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు ఈటెల. తెలంగాణ సమాజ చైతన్యం కోసం పాటు పడిన నాయకుడు ఈటెల. తెలంగాణ ఆలోచనా పరుడు ఈటెల. వివేకవంతమైన విజ్ఞానవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణం జరగాలని బలంగా కోరుకున్న నాయకుడు ఈటెల. విద్యార్ధి దశ నుంచే తెలంగాణ సమాజ వికాసం కోసం పాటు పడిన నాయకుడు ఈటెల. 

 తెలంగాణ అంటే ఈటెలకు వల్లమాలిన అభిమానం.  

తెలంగాణలో వున్న అసమానతలు చూసి విద్యార్ధి దశలోనే విద్యార్ధి ఉద్యమాలు , రాజకీయాల వైపు అడుగులు వేశారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమ కారులను ఎంతో మందిని గుండెల్లోపెట్టుకొని చూసుకున్నారు. వారికి ఎలాంటి ఆపదలు వచ్చినా ఆదుకున్నారు. ఉద్యమ సమయంలో పోలీసుల నిర్భంధాలను ఎదుర్కొన్నవారిని రక్షించారు. వారికి అండగా నిలిచారు. కోర్టు కేసుల కోసం కొన్ని లక్షలు ఖర్చు చేశారు. కష్టపడి సంపాదపించిన ఆస్ధులను కూడ అమ్మి ఉద్యమాకారులను కాపాడుకున్నారు. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న ఎంతో మంది నాయకులు ఈటెల రాజేందర్‌ తీర్చిదిద్దిన వాళ్లే. అందుకే ఈటెల రాజేందర్‌ అజాతశత్రువు. ఆయనను ఏ పార్టీ నాయకులైనా గౌరవిస్తారు. ఈటెలను పల్లెత్తు మాట అనాలంటే ఏ పార్టీ నాయకులు ధైర్యం చేయలేరు. ఎందుకంటే ఆకాశమంత ఎత్తైన ఉద్యమ ప్రస్ధానం ఈటెల రాజేందర్‌ది. అందుకే ఆయనంటే తెలంగాణ సమాజానికి ఎంతో గౌరవం. పద్నాలుగేళ్లపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎక్కడో లోపం జరుగుతోంది. పార్టీ నిర్మాణం కోసం పనిచేసి వారికి అన్యాయం జరుగుతోందని మొదట గ్రహించిన నాయకుడు ఈటెల. అందుకే బిఆర్‌ఎస్‌ ఏర్పాటైన తర్వాత గులాబీ జెండాకు నేను కూడా ఓనర్నే అని ప్రకటించిన దైర్యవంతుడు ఈటెల. ఈ మాటలు కేసిఆర్‌కు నచ్చలేదు.

 ఎన్నటికైనా ఈటెల నుంచి ప్రశ్నను వినల్సివస్తుందని కేసిఆర్‌ భయపడ్డాడు.

 తెలంగాణ సమాజ జాగృతిలో ఎక్కడో లోపం జరుగుతోందని గ్రహించిన ఈటెల పరిగే ఎరుకుంటే ప్రగతి కాదనడం కేసిఆర్‌ అసలు మింగుడు పడలేదు. ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకొని సరిదిద్దాల్సిన సమయంలో ఈటెలనుంచి సూచనలు, సలహాలు తీసుకోవాల్సిన తరుణంలో ఈటెలను పార్టీ నుంచి తరిమేయాలని చూశారు. ఈటెల మీద నిందలు మోపారు. పార్టీ నుంచి గెంటేశారు. ఒక ఉద్యమ కారుడికి, తెలంగాణ త్యాగధనుడు ఈటెలకు జరిగిన పరాభవం తెలంగాణ సమాజమే మెచ్చలేదు. కేసిఆర్‌ నిర్ణయాన్ని స్వాగతించలేదు. కేసిఆర్‌ అహం ఆనాడే అణచాలని తెలంగాణ సమాజం నిర్ణయించింది. తెలంగాణ సమాజం ఈటెల వైపు నిలిచింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటెలను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకున్నది. ఆయనను మళ్లీ గెలిపించుకున్నది. బిఆర్‌ఎస్‌ నిందలు నీటి రాతలని తెలంగాణ ప్రజలకు తెలుసు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని కేసిఆర్‌ చూశారు. ఆస్ధులను ఆగం చేయాలని చూశాడు. కాని తెలంగాణ ప్రజల గుండెల్లో వున్న ఈటెల స్ధానాన్ని కదిలించలేకపోయాడు. ఒక్క ఎన్నిసారి ఈటెల రాజేందర్‌ ఓడిపోవచ్చు. కాని ఆయన నాయకుడిగా ఎప్పుడూ ఓడిపోడు. పార్లమెంటు ఎన్నికల మల్కాజిరి నుంచి పోటీ చేసి గెలిచాడు. ఈటెల ప్రస్ధానం మళ్లీ మొదలైంది. ఇక్కడి నుంచి మళ్లీ విజయాల ప్రస్తానం పరుగందుకున్నది. బిఆర్‌ఎస్‌ లో వుంటే జీవితంలో ఆ పార్టీకి అధ్యక్షుడయ్యే అవకాశం వచ్చేది కాదు. ఆ పార్టీ లో ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశమే లేదు. కాని జాతీయ పార్టీ బిజేపిలో ఈటెల లాంటి ఎంత మంది నాయకులు కాగలరు. ఆ పార్టీని ఏలగలరు. ఆ అదృష్టం ఇప్పుడు ఈటెలను వరించనున్నది. భవిష్యత్తులో తెలంగాణ సిఎం. కూడా అయ్యేందుకు మార్గం పడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *