
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో సకల గుణాల కలబోత జనహృదయనేత చత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి బిజెపి మండల అధ్యక్షుడు మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడు, యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే చత్రపతి శివాజీ 1630లో ఫిబ్రవరి 19న మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్న శివుని కోటలో జిజియాబాయీ, షాహజీ దంపతులకు జన్మించాడు. 16వ ఏటని కత్తి పట్టి తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పించి, భారత రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్టతుడయ్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్ కు చెందిన తోరణా దుర్గాన్ని స్వాధీనం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శివాజీ మెరుపు దాడులు, కెరీర్ల యుద్ద పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ శివాజీ ఎంతోమందిని చంపడానికి ప్రయత్నించినప్పుడు వ్యూహాత్మకంగా తను ధరించిన పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్ట చీల్చి సహకరించాడు. శివాజీ విజయాలతో మొఘల్ పాలకుడు ఔరంగాజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఇలా శివాజీ గురించి చెప్పుకుంటూ పోతే రోజు గడుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోనగంటి రమేష్, చేగొండ శ్రీనివాస్, రాజబాబు, గురు సింగ్, సాగర్, వెంకీ, సాయి, బన్నీ, రాకేష్,స్నుహితు తదితరులు పాల్గొన్నారు.