మంద కృష్ణ మాదిగ పునరాలోచన చేయాలి
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ
హన్మకొండ, నేటిధాత్రి:
దళిత వ్యతిరేక పార్టీ బిజెపి అని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంటి సునీల్ మాదిగ ఆరోపించారు. హన్మకొండ లోని ఏకశిలా పార్కులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి గుడికి బడికి దూరం కావడానికి ప్రధాన కారణం మనువాదమేనని సందర్భంగా ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగం రద్దుచేసి మనువాదాన్ని అమలు చేయాలని చూసే బిజెపికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలపడం సరికాదన్నారు. గతంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడి భూమినే కబ్జా చేసిన ఆరూరి రమేష్ కు నేడు మద్దతు తెలపడం శోచనీయమని అన్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు సమచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కడియం కావ్య గెలుపు కోసం తమ వంతుగా కృషి చేస్తామని సందర్భంగా ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎలుకటి జనార్థన్ మాదిగ, కవ్వంపల్లి రవి మాదిగ, జిల్లా అధ్యక్షులుఎర్రోల్ల సురేష్ మాదిగ, నాయకులు మాట్ల రమేష్ మాదిగ,సప్పి పోచన్న మాదిగ
జన్ను నరేందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.