*మెదరమెట్ల గ్రామం అభివృద్ధి చెందాలంటే బిజెపి బలపరిచిన చింతకింది మౌనిక సాయిరాం బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలానికి చెందిన మెదరమెట్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చింతకింది మౌనిక సాయిరాం గారు ఇంటింటి ప్రచారం వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడానికి బీజేపీ అభ్యర్థి గెలుపు అత్యంత కీలకమని గ్రామస్తులకు వివరించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి గారు పాల్గొని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంక్షేమ పథకాలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామానికి కావాల్సిన రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, పేదలకు కల్పించే సేవలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు బీజేపీ అభ్యర్థి మౌనిక సాయిరాం గారు కృషి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు.
గ్రామ ప్రజలు అభ్యర్థికి మంచి స్పందన ఇస్తూ, అభివృద్ధి పరమైన మార్పుల కోసం బీజేపీకి తమ మద్దతు తెలుపుతున్నారు. బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలంటూ డాక్టర్ కీర్తి రెడ్డి గారు కోరారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి హరికృష్ణ,వీరన్న,మల్లారెడ్డి ప్రభాకర్,లింగమూర్తి.రాజయ్య నగేష్ సతీష్ ఓదెలు వెంకటేష్. సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు
