బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్
బీసీల గురించి ఆలోచించని బిజెపికి వారి ఓట్లు అడిగే హక్కు లేదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ ప్రధాని హాయాంలోనే బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అగ్రవర్ణ నాయకుల చేతిలో కీలుగు బొమ్మగా మారారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి మేనిఫెస్టోలో కులగణన చేస్తామని పేర్కొందని, దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం కులగణనపై చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటన పట్ల మహేందర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఇండియా కూటమికి పూర్తిగా మద్దతిస్తున్నామని, కాంగ్రెస్ గెలుపు కోసం బీసీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.