
అఖిలపక్ష పార్టీ నాయకల ఆరోపణ
16న జరిగే జాతీయ సమ్మెను విజయవంతం చేయాలి
అఖిలపక్ష పార్టీ నాయకుల పిలుపు
భూపాలపల్లి నేటిధాత్రి
దేశంలో నరేంద్ర మోడీ పాలనలో కార్మిక హక్కులను కాలరాశి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని అఖిలపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు.
ఈనెల 16న నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే జాతీయ సమ్మెను అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అఖిలపక్ష పార్టీ నాయకులు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి,సిపిఎం జిల్లా కార్యదర్శి బంద్ సాయిలు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సోతుకు. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్ లో ఏర్పాటుచేసిన అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడలు విభజించి కార్మిక హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను గుత్తపెట్టబడుదారులకు ధారధత్వం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, అంబానీల బడా పెట్టుబడుదారులకు అప్పగిస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి మోడీ అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం అన్ని పార్టీల ప్రజా సంఘాల నాయకులు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్,చల్లూరి మధు, క్యాతారాజు సతీష్,వెలిశెట్టి రాజయ్య,కౌన్సిలర్లు ముంజాల రవీందర్,సిరుప అనిల్, పిల్లలమర్రి శారద నారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకులుజంపయ్య,పిప్పాల రాజేందర్, సాంబమూర్తి, శ్రీకాంత్, అస్లాం,ఏ రమేష్,శేఖర్,రజాక్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.