జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే

BJP

జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే సాధ్యం..

బి జే పి జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్

మంగపేట నేటిధాత్రి :

 

మంగపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షుడు రావుల జానకిరామ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ….. దేశంలోని జనగణనలో కులగణనను చేయడం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందని నిరూపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నే అని ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు పరిపాలించినా ఏనాడు కూడా జనగణన కుల గణనను చేయించిన దాఖల లు లేదని ఇంత బృహోత్కరమైన కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ నిర్వహించిన సందర్భంగా మండల నాయకులు అందరూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యరంగారి వీరన్ కుమార్, గుండు రాజేష్, రామ గాని నరేందర్, బట్ట బాబురావు, కాసర్ల మల్లారెడ్డి, , సునీల్ కుమార్, గుండారపు రోహిత్ కుమార్, వై ప్రకాష్, కాక లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!