
BJP Forms
20 మందితో బిజెపి పార్టీ నూతన జిల్లా కమిటీ ఎన్నిక
జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బిఎంఎస్ కార్యాలయంలో బిజెపి పార్టీ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ 20 మందితో బిజెపి పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ని రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం జరిగింది ఆరుగురు ఉపాధ్యక్షులు ముగ్గురు జనరల్ సెక్రెటరీ ఐదుగురు జిల్లా సెక్రెటరీ మీడియా కోఆర్డినేషన్ ఆఫీస్ బాయ్ 20 మంది సభ్యులతో జిల్లా కమిటీగా ఎన్నిక చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ నాయకుల పేర్లు చెప్పి కొంతమంది పాఠశాలలో కళాశాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు వారు ఎవరైనా ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాము అని వారు అన్నారు అనంతరం జిల్లా కమిటీని ప్రకటించారు జిల్లా ఉపాధ్యక్షులుగా దాసరి తిరుపతిరెడ్డి. మోరి రవీందర్ రెడ్డి. వేషాల సత్యవతి. పూడెపాక స్వరూప. శ్యామల మధుసూదన్ రెడ్డి. గొర్రె శశికుమార్. జిల్లా జనరల్ సెక్రెటరీగా దొంగల రాజేందర్. పెండ్యాల రాజు. తాటికొండ రవి కిరణ్. డిస్టిక్ సెక్రటరీగా రాజేందర్ రెడ్డి. రామకృష్ణ. శ్రీనివాస్. వేణు. జిట్టబోయిన సాంబయ్య. ఆఫీస్ సెక్రటరీ తిరుపతి సోషల్ మీడియా ఇన్ఛార్జి దుగ్యాల రామచంద్రరావు మీడియా కవరే జ్ మునీందర్ ఐటీ ఇన్చార్జి వేణు రావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఎన్నికలకు సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డికి రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ పదవి మాకు ఇవ్వడంతో మా మీద మరింత భారం పెరిగింది బిజెపి పార్టీ స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలవడానికి మేము మా వంతుగా పాత్ర పోషించి మా నాయకులను కార్యకర్తలను స్థానిక సంస్థలు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు