
స్థానిక సంస్థల ఎన్షికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలి
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.బొంగోని సురేష్ గౌడ్
మద్దూరు నేటి ధాత్రి
జనగామ నియోజకవర్గం లో మద్దురు మండలంలోని లద్నూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ మద్దూరు మండల అధ్యక్షులు మోకు ఉదయ్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు బిజెపి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గ్రామానికి అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న ప్రతీ అభివృద్ధి బీజేపీ ప్రభుత్వం గ్రామపంచాయతీ కి నేరుగా నిధులు పంపించడం వల్లనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది అన్నారు .గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ. గ్రామ స్థాయి వార్డ్ మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బీజేపీ అభ్యర్థులే గెలవాలనీ, భారత ప్రధాని మోడీ సర్కార్ మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇచ్చిందని గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లద్నూర్ గ్రామం బీజేపీ కి మంచి పట్టున్న గ్రామమని బూత్ స్థాయి నుండి ఇంకా బలోపేతం చేయాలనీ పిలుపునిచ్చారు, బిఆర్ఎస్, కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి రాబోయే రోజులలో పలు నాయకులు బిజెపిలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శిలు బియ్య రమేష్, బొంగోని బాలు, సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ రాపాక బుచ్చిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్,రామకృష్ణ రెడ్డి,మండల నాయకులు రవీందర్ రెడ్డి, వీరయ్య,గోవిందచారి,ఉపేందర్.ఐలయ్య, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.