BJP Fight Lowers Sand Loading Charges
ఫలించిన బిజెపి పోరాటం
ఇసుక క్వారీల్లో తగ్గిన లోడింగ్ చార్జీలు
హర్షం వ్యక్తం చేస్తున్న ఇసుక లారీ ఓనర్స్
మహాదేవపూర్ నవంబర్ 27 నేటి ధాత్రి *
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రంలో నడుస్తున్న ఇసుక క్వారీలలో అధిక లోడింగ్ చార్జీలు వాసులు చేస్తున్నారనే లారీ డ్రైవర్ల సమాచారం మేరకు గత వారం రోజుల క్రితం ఇసుక క్వారీలను సందర్శించి,ఇసుక అధిక లోడింగ్ చార్జీలపై క్వారీ యాజమాన్యన్ని ప్రశ్నించడం జరిగింది వారు దొర్జన్యంగా మేము ఇలాగే వసూల్ చేస్తాం అని వారు మమ్మల్ని బెదిరియ్యడం జరిగింది, వారిపై మొదటగా ప్రాజెక్ట్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలని తెలుపగా వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికే వత్తస్ పలికేలా మాట్లాడరు,
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాళేశ్వరం పర్యటన కి వచ్చిన్నపుడు వారికీ సరి అయినా ఆధారాలతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వెంటనే స్పందించిన అధికర యంత్రాంగం ఇసుక లోడింగ్ ఛార్జిలను తగ్గించడం జరిగింది,4100 ఉన్న ఇసుక లోడింగ్ ఛార్జ్ ని 2500 తగ్గించడం జరిగింది,గవర్నమెంట్ అడర్స్ ప్రకారం అసలు లోడింగ్ ఛార్జ్ కి డబ్బులు చెల్లించవాల్సిన అవసరం లేదు కానీ క్వారీ కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులు కుమ్మకై మీకు ఇంత మాకు ఇంత అని పంచుకుంటున్నారు, గవర్నమెంట్ అడర్స్ కంటే ఒక రూపాయి ఎక్కో తీసుకున్న కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమలు చేసి మా ప్రాంత లో అక్రమాలకు తావు లేకుండా చేస్తామని అన్నారు, అలాగే అవినీతి గురించి తెలుపుగనే స్పందించి చర్యలు తీసుకున్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు వారు ధన్యవాదములు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది
