"BJP Raises Alarm Over Dilapidated Double Bedroom Houses in Sirisilla"
సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన
బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉండటం అత్యంత దురదృష్టకరమని దుమాల శ్రీకాంత్ పట్టణ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ, సిరిసిల్ల పట్టణ శాఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఇళ్లను స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా నిర్లక్ష్యానికి గురవడం ప్రజాధనానికి ఘోరమైన అవమానమని అన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామాగ్రి దొంగలపాలవుతుండగా, ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సిరిసిల్ల పట్టణ శివారులో అత్యంత ఖరీదైన స్థలంలో ఇట్టి డబుల్ బెడ్ రూమ్ ఇలడ్లు నిర్మాణం జరిగినవి అంతకుముందు ఇదే స్థలంలో ఎస్సీ కులస్తులకు కాలనీ నిర్మించి అది కూడా శిథిలావస్థకు చేరగా వాటి స్థానంలో ఈ డబల్ బెడ్ రూమ్ ఇడ్లు నిర్మించారు. ఇప్పుడు ఇవి కూడా వాటిలాగే సితిలావస్థకు చేరే పరిస్థితి.
గతంలో ఈ ఇళ్లను మొదటగా ఎస్సీ కులస్తులకు కేటాయించిన తర్వాత మిగతా అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.
అప్పటి మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే అప్పుడు డబల్ బెడ్ రూమ్ ల పంపిణీ చేయగా ఇంకా 900 మంది మిగిలిన వారు ఉన్నారు అందులో నుండి కొంతమంది కి పట్టాలు ఇచ్చారు కనీసం వారికి స్థలం కూడా చూపించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను విస్మరించి కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవడం బాధాకరమని మండిపడ్డారు.
కిరాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేనిపక్షంలో ఇవి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ విషయంలో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని, అర్హులైన నిరుపేదలకు ఇళ్లను వెంటనే కేటాయించాలని బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని దుమాల శ్రీకాంత్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, మోర రవి, నరసయ్య, దూడం సురేష్, గాని శ్రీనివాస్, కంబోజి శ్రీధర్, అంకారపు రాజు వర్ణాల శేఖర్ బాబు అభి కనుకయ్య దేవరాజు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
