MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP కథలాపూర్ మండల శాఖ….
నేటి ధాత్రి కథలాపూర్
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కథలాపూర్ మండలంలోని నాలుగు గ్రామాలకు MP నిధులను కేటాయించడంతో BJP మండల శాఖ,బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సిరికొండ,తండ్రీయాల, కథలాపూర్ గ్రామాలకు బోర్ మోటార్,దులూర్ రజక సంఘ భవనానికి 9 లక్షల రూపాయలు విడుదల చేయడం పట్ల పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్,వేములవాడ నియోజకవర్గ నాయకులు చెన్నమనేని వికాస్ రావు లకు బీజేపీ మండల శాఖ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో BJP మండల అధ్యక్షులు మల్యాల మారుతి,సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావ్,బద్రి సత్యం,కథలాపూర్ మహేష్, కాసోజీ ప్రతాప్,నరెడ్ల రవి,గడ్డం జీవన్ రెడ్డి, తెడ్డు మహేష్ పాల్గొన్నారు.