బీజేపీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్
బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి.ఏదో కాగితాలు తెచ్చాడు.
అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. అంతేకాకుండా నిన్న ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమం కోట సంవత్సరానికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ మైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు.
అంతేకాకుండా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రాష్ట్రం వాటాన చెల్లిస్తుందని తెలియజేశారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గరీబ్ యోజన కింద ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్రం నుండి లభిస్తుంది మిగిలిన ఒక కిల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుండి లభిస్తుందని తెలియజేశారు.

మంత్రి పొన్నం తేవాల్సింది సన్న బియ్యం కాగితాలు తేక బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని వేరే ముచ్చట్లు చెయ్యడం కరెక్ట్ కాదు.
అని సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, ఉరవకొండ రాజు,మెరుగు శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.