BJP Leaders Submit Memo Over Cow Protector Attack
కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిధర్
భూపాలపల్లి నేటిధాత్రి
గోరక్షణ కార్యకర్త ప్రశాంత్ సింగ్ (సోను) పై జరిగిన గన్ ఫైరింగ్ ఘటనకు సంబంధించి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ
“గోరక్షణ ధర్మం కేవలం వ్యక్తిగత కర్తవ్యం మాత్రమే కాక, మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన బాధ్యత. గోమాతను కాపాడటం ద్వారా మనం సమాజానికి, సంప్రదాయాలకు, పౌరహక్కులకు రక్షణ కల్పిస్తున్నాము. ఇలాంటి పవిత్రమైన సేవలో నిమగ్నంగా ఉన్న కార్యకర్తలపై దాడులు జరగడం అత్యంత బాధాకరమని, తీవ్రంగా ఖండించదగినదని చెప్పాలి.
ప్రశాంత్ సింగ్ (సోను) వంటి గోరక్షకులు సమాజంలో ధర్మం, సత్యం, జాగృతి కల్పించే కార్యక్రమాలలో అంగీకారపూర్వకంగా పాల్గొంటున్నారు. వారిపై జరిగిన దాడి కేవలం వ్యక్తిపైన కాక, గోరక్షణ ధర్మంపై ప్రత్యక్ష దాడిగా భావించవలసినది. ఇది సమాజంలో భయభ్రాంతిని సృష్టించే మాత్రమే కాక, గోరక్షకుల సేవను నిర్లక్ష్యం చేయడం అని మేము గట్టిగా అభిప్రాయపడుతున్నాము.
ప్రభుత్వం వెంటనే స్పందించి, దోషులను కఠిన చర్యలతో శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా, గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం అత్యవసరము. గోరక్షకుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, పోలీస్ సురక్షా చర్యలు, సమగ్ర నియంత్రణలు తీసుకోవడం తప్పనిసరి.
భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ గోరక్షకుల పక్కన నిలుస్తుంది. గోమాత రక్షణకు అంకితభావం కలిగిన ప్రతి కార్యకర్తకు మేము మద్దతుగా ఉంటాము. గోమాతకు ఉన్న భక్తి, గౌరవం ఎవరూ దెబ్బతీయలేరు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాక, మన దేశ సంస్కృతి, మన ధర్మానికి సంబంధించిన అంశమని గట్టి విశ్లేషణతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
