`తమిళనాడు లో పాగా వేయడం ఖాయం!
`పశ్చిమ బెంగాల్ లో విజయం తథ్యం.

`అస్సాం లో మళ్ళీ బీజేపీదే అధికారం
`కేరళంలో బలమైన అడుగు సాధ్యం.
`పాండిచేరి లో సునాయాస విజయం.
`ఐదు రాష్ట్రాలలో బీజేపీ గెలిస్తే జమిలి ఎన్నికలు ఎంతో దూరం ఉండవు.
`వీలైనంత తొందరగానే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం.
`అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణా లో బీజేపీ జెండా కు ఎదురుండక పోవచ్చు?
`తెలంగాణా లోను అధికారం సొంతం చేసుకోవచ్చు?
`మళ్ళీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు కావొచ్చు?
`తెలంగాణా రాజకీయాలు చక చకా మారిపోవచ్చు?
`రెండేళ్లలో తెలంగాణా లో కాషాయం రేపరెపలాడొచ్చు!
`వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి అధికారం దక్కొచ్చు!
`దక్షణాధిలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారొచ్చు!
`దేశమంతా కాషాయమై బీజేపీ అన్ని రాష్టాలలో అధికారం సొంతం కావొచ్చు.
`దేశమంతా డబులింజన్ సర్కార్ లతో కాషాయం కళకళలాడొచ్చు
హైదరాబాద్, నేటిధాత్రి:
ఐదు రాష్ట్రాý ఎన్నికలకు నగార మ్రోగింది. ఇప్పటికే ఆరు నెలలుగా ీVAరా ీVAరీ ప్రచారం జరుగుతోంది. సభలు సమావేశాలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, హమీలు, మ్యానిఫెస్టోల రూపకల్పన, పొత్తులు వంటి అనేక అంశాలు తెరమీదకు వస్తూనే వున్నాయి. ఆ ఐదు రాష్ట్రాలకు జాతీయ స్దాయి నాయకులు క్యూ కడుతూనే వున్నారు. స్దానిక నాయకత్వాలు, పార్టీలు తమ తమ ప్రచారాలు సాగిస్తూనే వున్నాయి. ఎన్నికల సమయం రానే వచ్చింది. ఐదు రాష్ట్రాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఆరు నెలల ప్రయాస ఒక ఎత్తేతే ఈ పదిహేను రోజుల ప్రచారం, అభ్యర్దుల ఎంపిక, పార్టీ మధ్య అవగాహన ఎంతో కీలకం. ముందుగా తమిళనాడు రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ఏక కాలంలో జరగనున్నాయి. కేరళలలోనూ ఏక కాలంలో జరిపనున్నారు. అస్సాం, బెంగాల్‌లలో మాత్రమే రెండు విడుతలుగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. పాండిచ్చేరిలో కూడా ఒకే రోజులో ఎన్నిÅ£లు జరగుతాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాలలో బిజేపి దూసుకుపోతుందన్న వార్తలు మాత్రం జాతీయ స్దాయిలో విసతంగా ప్రచారంలో వున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో ఈసారి బిజేపి తన హావా మొదలౌతుందని అంటున్నారు. ఇప్పటి వరకు జాతీయ పార్టీలకు ప్రాదాన్యత లేని తమిళనాడులో బీజేపి చాలా ముందుంజలో వున్నట్లు అనేక సర్వే సంస్ధలు చెబుతున్నాయి. గతంలో ఈ స్దాయిలో కాంగ్రెస్ కూడా లేదని తెలుస్తోంది. తమిళనాడులో ఒంటరిగానే బిజేపి పోటీ చేస్తున్న సంకేతాలు ఇప్పటి వరకు అందుతున్నాయి. అయినా బిజేపి ప్రస్తుతం అదికారంలో వున్న డిఎంకె కన్నా మెరుగైన స్దానంలో వున్నట్లు సమాచారం. అయితే ఏఐడిఎంకే కు జనం ఆదరణను బట్టి మరింత బిజేపికి అనుకూలంగా వుంటుందని తెలుస్తోంది. మరో వైపు తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చిన టివికేతో బిజేపి పొత్తు సంప్రదింపులు జరుగుతున్నట్లు కూడా సమాచారం. అందుకు ఆంద్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాయభారం చేసే పరిస్దితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబాలకు తమిళనాడులో కూడా మంచి పేరుంది. వారి సినిమాలకు కూడా మంచి ఆదరణ వుంది. హీరోగా పవన్‌కు అక్కడి యూత్‌లో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్ ఉపయోగించుకోవాలిన బిజేపి చూస్తోంది. తమిళనాడులో బిజేపి పెద్దలతోపాటు, పవన్ కూడా ప్రత్యేకంగా ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. దాంతో బిజేపికి మెరుగైన స్ధానాలు పొందేందుకు అవకాశం వుంది. అదే సమయంలో టివికే అద్యక్షుడు విజయ్‌కు కూడా తమిళనాడులో మంచి ఫాలోయింగ్ వుంది. ప్రస్తుతం ఆయన తమిళనాడులో అగ్రహీరోగా వెలుగొందుతున్నారు. బిజేపితో కలిస్తే బాగుంటుందన్న సంప్రదింపులు కూడా త్వరలో జరిగే అవకాశమున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరుకైతే తమిళనాడులో తళపతి వ్పుియ్కు వన్ సైడ్ విన్ కనిపించడం లేదు. అదికార పార్టీకి ప్రత్నామ్నాయంగా కూడా జనం బావించడం లేదు. తమిళనాడులో అధికార డిఎంకెకు ప్రత్నామ్నాయంగా బిజేపి మాత్రమే కనిపిస్తుంటున్నారు. అందుకే గత ఏడాది కాలంగా ీVAం శాఖ మంత్రి అమిత్‌షా పూర్తి కాన్సంట్రేషన్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీ కూడా పలు పర్యాయాలు తమిళనాడుకు వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో కూడా విసతంగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ రాజీకయాల్లో ఈసారి బిజేపి కీలకమైన భూమిక పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. అలాగే మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళంలో కూడా బిజేపి బలంగానే కనిపిస్తోంది. అక్కడి ప్రజల కోసం రాష్ట్రం పేరు కూడా మార్పు చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్నదానిని నిజం చేశారు. పైకి వామపక్ష పార్టీలది పై చేయి కనిపించినా, కాంగ్రెస్‌కు కొంత అనుకూలమైన వాతావరణం వున్నట్లు ప్రచారం వున్నా, ప్రజల్లో మాత్రం బిజేపిని బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేరళలలో విద్యావంతులు ఎక్కువ. వాళ్లు మిగతా రాష్ట్రాలలో లాగా ఎన్నికల సభలకు హజరు కాదు. అక్కడ ఎప్ప్పుడైనా సైలెంట్ ఓటింగ్ వుంటుంది. ఆ సైలెంట్ ఓటింగ్ బిజేపికి అనుకూలంగా వుంటుందని కొన్ని సర్వే సంస్ధలు తెలియజేస్తున్నాయి. ఇక ఉత్తరాదిలో ప్రధానంగా అందరూ చూస్తున్న రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్లో ఈసారి బిజేపి విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో ఎలాంటి షశబిషలు అవసరం లేదంటున్నారు. గత ఎన్నికల్లో ఏకంగా సిఎంగా వున్న మమత బెనర్జీ ఓడిపోవడం జరిగింది. పార్టీ గెలిచినా, ఆమె ఓడిపోయింది. అంటే మమత బెనర్జీ ప్రభావం ఈ ఎన్నికలల్లో మరింత తగ్గిపోయిందని తెలుస్తోంది. ఈసారి బిజేపి వేస్తున్న వ్యూహాలు ఖచ్చితంగా తణమూల్ కాంగ్రెస్న్ ఓడిస్తాయని సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. ఇక అస్సాంలో ఎలాగూ ఇప్పటికే బిజేపి అదికారంలో వుంది. మరోసారి ప్రజలు బిజేపికే పట్టం కడతాయని అన్ని సర్వే సంస్ధలు ముక్త కంఠంతో చెబుతున్నాయి. ఇక పాండిచ్చేరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ కూడా బిజేపి జెండా ఎగరడం ఖాయమే అంటున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజేపి ఘన విజయం తర్వాత దేశ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం వుంది. బిజేపి పార్టీ 2027లోనే జమిలీ ఎన్నికలకు వెళ్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఆరు నెలల్లో జనాభ గనణ పూర్తి చేసి, ఆరు నెలల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తిచేసే అవకాశం కనిపిస్తోంది. 2027 చివరి కల్లా జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమౌతుందని అంటున్నారు. జమిలీ ఎన్నికలు బిజేప కల. ఎలాగైనా బిజేపి ఒక్కసారైనా జమిలీ జరపాలని చూస్తున్న సంగతి తెలిసిందే. పైగా మరో దశాu్ధకాలం పాటు మోడీ ప్రధానిగా కొనసాగే అవకాశం వుంది. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సష్టించాలనేది మోడీ ఆకాంక్ష అనేది కూడా అందరికీ తెలిసిందే. గత పార్లమెంటు ఎన్నికల్లో బిజేపి సంపూర్ణ మెజార్టీ సాదించకపోయినా, తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ బిజేపి తిరుగులేని విజయాలు లిఖిస్తూ వస్తోంది. ఆ మధ్య జరిగిన హర్యానా, డిల్లీ ఎన్నికల్లోనూ బిజేపి అనూహ్య విజయం సాదించింది. తర్వాత జరిగిన బిహార్ , మహరాష్ట్ర ఎన్నికల్లో మళ్లీ తన హవా కొనసాగించింది. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలలో బిజేపి అదికారంలో వున్నట్లే లెక్క. కేవలం మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ అదికారంలో వుంది. ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో ఈసారి విజయం ఖాయమైపోయినట్లే లెక్క. దక్షిణాదిలో తమిళనాడులో గెలిచే పరిస్దితులు పుష్కలంగా వున్నాయి. అలా దేశమంతా విస్తరించిన వేళ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే బిజేపికి రెండింట మూడు వంతుల మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. మరో పదేళ్లపాటు బిజేపికి ఎలాంటి ఎదురుండదని అనుకుంటున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగిన వెంటనే తెలంగాణ మీద బిజేపి పూర్తి స్ధాయి దష్టిపెడుతుందని అంటున్నారు. ఇప్పటికే అధ్యక్షుడు రాంచంద్రరావు పార్టీని చాప కింద నీరులా పార్టీని విస్తరిస్తున్నారు. ఆయన చేస్తున్న రాజకీయం పైకి కనిపించకపోయినా, ఎంతో చాకచక్యంగా పార్టీని మరింత బలోపేతంచేస్తున్నారు. ఈవిషయాన్ని కూడా ఆయన పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. బిజేపి రాజకీయం ఆది నుంచి ఇలాగే వుంటుంది. పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తలతోనే పార్టీల నాయకుల ఎక్కువగా సంప్రదింపులు జరుపుతుంటారు. మిగతా పార్టీలన్నీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తుంటారు. బిజేపి అందుకు భిన్నంగా కార్యకర్తల మనసులను గెల్చుకుంటుంది. క్షేత్ర స్దాయి పరిస్టితులను తెలుసుకుంటుంది. పైకి రామచంద్రరావు ఏమీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నా, ఆయన ఎంతో సైలెంట్‌గా తన రాజకీయం తాను చేసుకుంటూ పోతున్నారు. తెలంగాణలో ఎన్నికలకు రెండున్న సంవత్సరాలు వుంది. ఈలోపు పార్టీని బలోపేతం చేయడం కోసం మరోసారి కేంద్ర మంత్రి బండి స్పుంయ్ను రంగంలోకి దింపుతుందని సమాచారం. యూత్‌ను, సామాన్య ప్రజలను ఆకర్షించేలా మాట్లాడడం బండిసంజయ్ స్పెషాలిటీ. ఏదైనా సరే ఆయన సూటిగా చెప్పేస్తారు. ఏ విషయానైన్నానా సరే కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. అలాంటి నాయకుడిని ఈసారి ఎన్నికలరంగంలోకి దింపి, జాతీయ స్దాయి నాయకుల నిరంతర పర్యవేక్షణ చేస్తూ, బిజేపి తన స్టైల్లో రాజకీయం చేయడం అనేది చాలా ప్రత్యేకంగా వుంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లోనూ అధికారంలోకి వస్తామని బిజేపి నాయకులు ధీమాగా చెప్పడంలో కూడా కారణం అదే అంటున్నారు.
