వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులదే గెలుపు-బీజేపీ నాయకులు.
కరీంనగర్, నేటిధాత్రి:
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో క్రియశిలా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి నరేంద్రమోది నిధులతోనే జరుగుతుందని, రేషన్ బియ్యం పంపిణీ కేంద్రమే ఇస్తుందని వారన్నారు. ఈజిఎస్ నిధుల ద్వారా గ్రామాలలో సిసి రోడ్లు కేంద్ర ప్రభుత్వం మే ఇస్తుందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని వారు తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయానికి నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని వారు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, జిల్లా కోశాధికారి వైద రామానుజం, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సెంటి జితేందర్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, కాడే నర్సింగం, కారుపాకల అంజిబాబు, మండల కార్యదర్శి కడారి స్వామి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, మునిగంటి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.