భద్రాది జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి
బిజెపి భద్రాద్రి జిల్లా నూతన అధ్యక్షులుగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నేటి ధాత్రి,;భద్రాద్రి జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ (బిజెపి) జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికై మొదటిసారి భద్రాచలం నియోజకవర్గ వచ్చిన బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి బ్రిడ్జి సెంటర్ వద్ద బిజెపి నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికి సీనియర్ నాయకులు అల్లాడి వెంకటేశ్వరరావు సాలువతో సత్కరించారు
ముందుగా భద్రాచలం రామాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పాత్రికేయ సమావేశంలో
ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ నిధులు తీసుకురాకపోగా అవినీతికి పరాకాష్టగా మిగిలారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేననిస్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాదించడాన్నిఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందగా టిఆర్ఎస్ కనీసం బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సైతం కరువయ్యారనీఅన్నారు ఈ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ లోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా దర్శ,ములిశెట్టి రామ్మోహన్రావు, కుంజా సంతోష్, త్రినాథరావు, రఘురాం, బిట్రగుంట్ల క్రాంతికుమార్, ముఠాల శ్రీనివాసరావు, నాగబాబు, ముక్కెరకోటేశ్వరి పాల్గొన