యువతను, విద్యార్థులను మోసం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి

బీజేపీ, బీఆర్ఎస్ హాఠావో – దేశ్ బచావో నినాదంతో ఎన్నికల ప్రచారం:

బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదు:

ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో యువతను, విద్యార్థులను మోసం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడిద్దామని, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి డా.వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర పిలుపునిచ్చారు. హిమాయత్ నగర్ లోని ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో “బీజేపీ, బీఆర్ఎస్ హాఠావో – దేశ్ బచావో” గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వలి ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర* లు సంయుక్తంగా మాట్లాడుతూ యువతను, విద్యార్థులను మోసం చేయడంలో బీజేపీ, బీఆర్ఎస్ లు సిద్ధహస్థులయ్యారని విమర్శించారు. ఒక వైపు మే నెలలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ దేశ విచ్చిన్నకర విధానాలను ఓటర్లపై రుద్ది మళ్ళీ అధికారాన్ని పొందాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోడీ గత 10సంవత్సరాల కాలంలో దేశంలో ఎటువంటి మార్పులు రాలేదని, కేవలం మతోన్మాదం, కార్పొరేట్ శక్తుల అంశాలపైనే దృష్టి సారించారన్నారు. ఈ దశాబ్ద కాలంలో నిరుద్యోగం భర్తీ చేయలేనంతగా పెరిగిందని దీనికి దేశ ప్రధాని మోడీ నిరంకుశ విధానాలే కారణమని వారు దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా సమగ్ర యువజన విధానాన్ని అమలు చేయాలని,అందరికీ విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేస్తున్న మోడీను గద్దె దింపుదామని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆర్ఎస్ఎస్, బిజెపి రాజకీయాలను ఎండగడదామని, పౌర హక్కులు కాలరాస్తూ సిబిఐ, ఇడి లను రాజకీయాలను స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న బిజెపికి వ్యతిరేకంగా పోరాడుదామని, ఫెడరలిజం స్ఫూర్తిని దెబ్బతిస్తున్న దళిత, మైనారిటీ, ఆదివాసీ, మహిళా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న మోడీ, షాలను ఓడిద్దామని, విభజన హామీలను నెరవేర్చని మోడీని ఓడించాలన్నారు. అదే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు అన్ని రకాలుగా అన్యాయం చేసిందని, బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అందుకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీ కి ఓటేసినట్టేనని వారు ఉద్ఘటించారు. రాష్ట్రంలో మత రాజకీయాల పట్ల యువత, విద్యార్థులు సైద్ధాంతిక అవగాహనను పెంపొందించుకోవాలని వారు సూచించారు. ఈ ప్రధాన డిమాండ్ల తో ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓడించడం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో *ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ కునుకుంట్ల శంకర్, బిజ్జ శ్రీనివాసులు, టి. సత్య ప్రసాద్, పేరబోయిన మహేందర్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *