ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు -ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు/గంగాధర, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కొండన్నపల్లి, కురిక్యాల, ఉప్పర మల్యాల, రంగారావుపల్లి, తాడిజెర్రి, ఆచంపల్లి, చిన్న ఆచంపల్లి, గట్టుభూత్కుర్, హిమ్మత్ నగర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ పదిఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, తెలంగాణ రాష్ట్రంలో పదిఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఒక్క ఇల్లు కట్టి ఇవ్వలేదని, కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వలేదని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని, ప్రజాపాలన పేరుతో గ్రామాలల్లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, జూన్ మాసం నుండి గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలను గ్రామసభల ద్వారా ఎంపిక చేసి వారికి కొత్త ఇండ్లను కట్టిస్తామని, ఆగస్టు15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని, మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఐదువందల రూ.లకే సిలిండర్, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందజేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కులం మతాల పేరుతో ప్రజలను యువతను రెచ్చగొట్టడం తప్ప, పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని, స్థానికులు సౌమ్యులైన వెలిచాల రాజేందర్ రావును గెలిపించుకుంటే ఈప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో చొప్పదండి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రజల మధ్యనే ఉంటూ, చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పిటిసి పుల్కం అనురాధ నర్సయ్య, కురిక్యాల సింగల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, ఎంపీటీసీ ముద్దం జమున నగేష్, మాజీ సర్పంచులు రేండ్ల జమున శ్రీనివాస్, రోమాల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట సంధ్య, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మంత్రి లత, కర్ర విద్యాసాగర్ రెడ్డి, జాగిరపు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!