
కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులూరి మల్లేశం గౌడ్….
కొల్చారం, ( మెదక్) నేటి ధాత్రి:-
పదేళ్ల పాలనలో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులూరి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలు అభివృద్ధి చెందాలంటే ఆది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో అనేక గొప్ప ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను అందించిన ఘనత తమదని అన్నారు. రాజ్యాంగం రక్షించబడాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలన్నారు. పేదోళ్ల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటేసి మెదక్ అభ్యర్థి నీలంమధు ను భారీ మెజారిటీతో గెలిపించాలని మల్లేశం గౌడ్ అన్నారు .