లక్షటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా బియ్యాల తిరుపతిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన పీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా బియ్యాల తిరుపతి మాట్లాడుతూ నా పైన నమ్మకముంచి నన్ను అధికార ప్రతినిధిగా నియమించినందుకు పిసిసి అధ్యక్షులు సురేఖ కొక్కిరాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ పింగిలి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల వేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్, ఆరిఫ్, షాహిద్ అలీ, బొప్పు సతీష్, బాణాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.