ఘనంగా డాక్టర్.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

పేద బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ది

అమ్మఒడి ఫౌండేషన్ చైర్మన్,స్వేరో నాయకులు ఎల్తూరి శ్రీనివాస్

పరకాల నేటిధాత్రి

పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో జిల్లా నాయకులు పెండేల మహేందర్ ఆధ్వర్యంలో స్వేరో ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ 58వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ స్వేరో నాయకులు అమ్మఒడి ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ అమ్మఒడి శ్రీనివాస్ ఎల్తూరి,మాజీ సర్పంచ్ సమ్మిరెడ్డి హాజరై కేకుకట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం ఎల్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ అధికారిగా గురుకుల కార్యదర్శిగా ఎంతోమంది పేద ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించారని కూడు,గుడ్డ లేని పేద ప్రజల బిడ్డలకు తాను ఒక అండగా నిలబడి ఉన్నారని, గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంతోమంది లక్షలాదిమంది పేద బిడ్డల జీవితాలు వెలుగు నింపడానికి డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు సంపాదించాలని,కొడవళ్ళు పట్టిన చేతులతో కోడింగ్ చేయాలని,ఎర్ర బస్సు ఎక్కలేని నా పేద బిడ్డలు విమానంలో వెళ్లి విదేశాల్లో ఉన్నత చదువులు ఉద్యోగాలు చేయాలని,విద్య ద్వారానే వివక్షత పోతుందని విద్యతోనే ఈ సమాజంలో కించపరిచే వాళ్ళంత కూడా సెల్యూట్ చేయాలని,ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లుగా ఇంజనీర్లుగా విమానం పైలెట్లు ఓడలు నడిపే వాళ్ళుగ,హిమాలయ శిఖరాలను సైతం ఎక్కించి భారత దేశ జెండాను బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టించి భూగర్భంలో కూడా విజయాలు సాధించేలా తయారు చేశాడని మహిళలకు మహిళ విద్యార్థులకు ఒక డిగ్రీ ఆర్మీ స్కూల్లో ప్రారంభించి ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందుబాటులో తీసుకొచ్చిన తెలిపారు.అనంతరం హన్మకొండ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మహేందర్, శ్రీనివాస్ లు పాల్గొని రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో స్వేరో నాయకులు పెండేల రవీందర్,కాకి శరత్ చంద్ర,మచ్చ సురేష్,పెండేల రాము,ఉదయ్,పెండేల నవీన్,క్రాంతి,ఏకు రమేష్,వెన్నెల,రాము,ఎర్రోళ్ల పవన్,మునిగాల అశోక్,బరిగల బుజ్జన్న,స్వేరో విద్యార్థినిలు చిలుక శ్రావణి,కావ్య,బర్గెల సమ్మక్క,పెళ్లిల సమ్మక్క,సూరక్క,సంపూర్ణ,శ్రీలత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!