తెలంగాణ జాతిపిత కెసిఆర్ 70వ జన్మదిన వేడుకలు శనివారం 65వ డివిజన్ దేవన్నపేటలో గ్రామ శాఖ అధ్యక్షుడు పోలపల్లి రాజు (మైఖేల్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ దివ్యరాణి – రాజునాయక్ హాజరైనారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ రాష్ట్రనీ సాధించి,తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేసి 24 గంటలు కరెంటు,నీళ్ళు , రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ్ లక్ష్మి,లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ఉంచిన మహోన్నత వ్యక్తి అని అన్నారు మరియు పోలేపల్లి రాజు మాట్లాడుతూ మన ప్రియతమ నేత కేసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా పాలాభిషేకం చేసి పండ్ల పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు…