నేటిధాత్రి:హన్మకొండ
మేడారం సమ్మక్క- సారక్క చిత్ర పటం, తల్లుల ప్రసాదం (బంగారం) ఇచ్చి
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్, టీమ్ సభ్యులు.
ఈరోజు హైదరాబాద్ క్యూ న్యూస్ కార్యాలయంలో ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ అధ్వర్యంలో… జిల్లా టీమ్ సభ్యులు మల్లన్న కు మేడారం సమ్మక్క -సారక్క తల్లుల చిత్రపటాన్ని, ప్రసాదం బంగారం, ఇచ్చి శాలువా’తో సత్కరించి” పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మాదం రజినీ కుమార్, జిల్లా టీమ్ సభ్యులు మార్త శ్రీనివాస్, రెడ్డి రఘు, వనం రవీందర్, భూశేట్టి శ్రీకాంత్, మాలోత్ యాక రాజు తదితరులు పాల్గొన్నారు.