
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని ఎస్టి గర్ల్స్ కళాశాలలో ఏబిఎస్ఎఫ్ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వతంత్ర ఉద్యమంతోపాటు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని దేశం కోసం ఎనలేని కృషి చేశారని అదే విధంగా దళితుల హక్కులు,అభ్యుదయ
కోసం నిరంతరం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన అని పేర్కొన్నారు.కాగా ఆయనకు భారత రత్న అవార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి నిన్నవించారు.ఈ కార్యక్రమంలో స్వప్న ,శ్రీలత ,కావ్య ,రమ్య సుమలత ,భాగ్యశ్రీ.అనిత సౌజన్య ,ప్రణీత ,సుప్రియ తదితరులు పాల్గొన్నారు.