`మహాఘట్ బంధన్‌లో కుంపట్లు.
`బిహార్‌లో నిగ్గు లేతకపోతున్న సర్ధుబాట్లు!

`ఎన్డీయే కూటమి సీట్ల ప్రకటన దాదాపు ఖరారైంది.
`ఇండియా కూటమిలోనే లుకలుకలు కొనసాగుతున్నాయి.

`కాంగ్రెస్ గతంలో 71 సీట్లు పోటీ చేసింది.
`17 సీట్లు మాత్రమే గెల్చుకున్నది.
`ఈసారి 75 సీట్లు కావాలని కాంగ్రెస్ మెలిక పెట్టింది.
`అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని తేజస్వీ ప్రకటించారు.
`ఇండియా కూటమిలో కలకలం రేగింది.
`లాలూ కుటుంబం మీద కేసులు తెరమీదకు వచ్చాయి.
`ఆర్జేడీ దారికొచ్చింది..కూటమి బంధం గుర్తుకొచ్చింది.
`కాంగ్రెస్‌కు 60 సీట్లిస్తామంటోంది.
`ఆర్జేడీ 135 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
`మిగతా సీట్లు కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం వుంది.
`తాజాగా ప్రశాంత్ కిషోర్ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు.
`రాజకీయం ఎటు మారుతుందనేది సస్పెన్స్‌గా మారింది.
`ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం పికేకు ఇష్టం లేదు.
`రసవత్తరంగా మారనున్న బిహార్ పోరు.
హైదరాబాద్, నేటిధాత్రి:
బిహార్ రాష్ట్రంలో ఎన్నికల పొత్తులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నిస్తే సరైన సమాదానం ఎవరి వద్దా లేదు. ముఖ్యంగా ఇండియా కూటమిలో పొత్తులు పొడిచినా, సీట్ల సర్ధుబాటులో లుకలుకలు, చిటపటలు కనిపిస్తున్నాయి. ఓ వైపు బిజేపి, జేడీయూల పొత్తులు, సీట్ల పంపకాలు జరిగిపోయాయి. నామినేషన్లు కూడా వేస్తున్నారు. కాని ఇండియా కూటమిలో మాత్రం కుంపట్లు రేగుతున్నాయి. సీట్ల సర్ధుబాట్లు ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. యూపిఏ హాయాంలో ప్రతిపక్షం ఎప్పటిప్పుడు ఎంతో బలంగా వుంటూ వుండేది. కాని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార బిజేపి వేసే ఎత్తులకు ప్రతిపక్షాలు చిక్కుల్లో పడుతున్నాయి. సహజంగా ప్రతిపక్షాలు వేసే ఉచ్చులోఅదికార పార్టీ పడుతుంటాయి. ఓడిపోతుంటాయి. కాని ఇక్కడ గత పన్నెండు సంవత్సరాల కాలంగా ప్రతిసారి ప్రతిపక్షాలు పదే పదే బోల్తాపడుతున్నాయి. అయినా వాటి నుంచి తేరుకోవాలని ప్రతిపక్షాలు అనుకోవడం లేదు. ఐక్యత ప్రదర్శించడం లేదు. కలిసి సాగుదామన్న భరోసా వాటిలో కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఐక్యతకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇండియూ కూటమి పార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ పార్టీల కోసం కూడా పొత్తు ధర్మంలో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీలకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రాలలో ఆ పార్టీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయినా ఆ పార్టీలు రాహుల్ గాంధీని నమ్మడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు ఇండియా కూటమిలో లుకలుకలు వెగులోకి వస్తునే వున్నాయి. సమస్యలు పొడసూపుతూనే వున్నాయి. ఐక్యతకు బీటలు వారుతూనే వున్నాయి. అయినా ఎంత దిగినా ఫరావాలేదు. బిజేపిని ఓడిరచాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, రాహుల్ గాంధీ చేస్తున్న కష్టం, కూటమి పార్టీలు బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లుకలుకలు తెరమీదకు తెస్తూనేవున్నారు. రాహుల్ గాంధీ మూలంగానే ఇండియా కూటమికి మరింత బలం ఏర్పడిరది. ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతూ వస్తోంది. అయినా ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీకి హాండ్ ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది బిహార్‌లోనూ జరుగుతుందా? అన్న అనుమానం ఏర్పడుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన చేసింది. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. కాని బిహార్‌లోని ఇండియా కూటమిలో సీట్ల సర్ధుబాటు పూర్తి కాలేదు. ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్, ఆర్జేడీ పోటీ చేస్తాయన్నది తేలలేదు. ఇంకా సీట్ల నెంబర్లే తేల్చుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 75 సీట్లకు పోటీ చేసింది. కాని కేవలం 17 సీట్లు మాత్రమే గెలిచింది. ఇప్పుడు కూడా అదే నెంబర్ కావాలని కోరుతోంది. కాని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో ఆ మధ్య తేడాలొస్తే పూర్తి స్దానాలలో పోటీ చేసేందుకు తాము సిద్దమంటూ కూడా తేజస్వీ యాదవ్ అన్నారు. అయితే ఇక్కడ రాహుల్ గాందీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. దేశంలోని రాష్ట్రాలలో వున్న ప్రాంతీయ ప్రతిపక్షాలన బలోపేతం చేయడం తన భుజాల మీద వేసుకుంటున్నాడు. నిజానికి ఆ పని రాహుల్ గాందీ చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కాంగ్రెస్‌ను మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాందీ ఎన్ని సార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చారు? అదే బిహార్‌లో ఎన్నికల ప్రచారానికి ఎన్నిసార్లు వెళ్లారనేది లెక్కతీస్తే అసలు విషయం అర్దమౌతుంది. అదే కర్నాకటలో కూడా అంతే. సొంత పార్టీ బలంగా వున్న రాష్ట్రాలలో పార్టీని అదికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బలంగా లేని రాష్ట్రాలలో సొంత పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలి. కాని ఆయన ప్రతిపక్షాల ఐక్యత కోసం పాటు పడుతున్నారు. ప్రతిపక్షాలను బలోపేతం చేసే పనిని ఎంచుకున్నారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ తన బలహీనతను తెలియజేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇన్ని సార్లు కాంగ్రెస్‌కు అవమానాలు ఎదురౌతున్నా కాంగ్రెస్‌లో మార్పు కనిపిండచం లేదు. దేశమంతా రాహుల్ గాందీ వెంట నడుస్తోంది. ఆయన మాత్రం ప్రతిఫక్షాల వెంట నడుస్తున్నారన్న అభిప్రాయం వక్తమౌతోంది. ఇండియా కూటమిలోనే ఇన్ని లుకలుకలు అని అనుకుంటే కాంగ్రెస్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఓటమి పాలు కావడం. 2014లో కనీసం 40 సీట్లు గెలవలేకపోవడం. దేశాన్ని అత్యధిక సార్లు పాలించిన, కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోవడం అనేది ఆ పార్టీకి మైనస్‌గా మారింది. మూడోసారి 2024లో 100 సీట్లు సాదించి ప్రతిపక్ష హోదా సాదించుకున్నది. అయినా ఆ పార్టీని ఇతర ప్రాంతీయ పార్టీలు లెక్క చేయడం లేదు. కనీసం వారి పార్టీల కోసం కాంగ్రెస్‌ను ఆసరా చేసుకొని గెలుద్దామన్న భావన వారిలోనూ లేదు. సమయం వస్తే కాంగ్రెస్‌ను దూరం పెట్టెందుకు సైతం ప్రాంతీయ పార్టీలు ఆలోచించడం లేదు. ఆ మధ్య జరిగిన డిల్లీ, పంజాబ్, హార్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఇదే అనుసరించాయి. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాయి. ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్‌పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే పరిస్దితి మరో రకంగా వుండేదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. ముందు కలిసి సాగాలని అనుకున్నారు. ఎన్నికల సమయం దాకా కలిసి ప్రచారం చేసుకున్నారు. కాని తీరా ఎన్నికల వేల పొత్తులు కుదరక విడిపోయారు. దాంతో కాంగ్రెస్‌ను చిక్కుల్లోకి నెట్టేశారు? ఫలితంగా హార్యానాలో కూడా ముచ్చటగా మూడోసారి బిజేపి కూటమి విజయం సాదించింది. మహరాష్ట్రలోనూ అదే జరిగింది. కాంగ్రెస్‌పార్టీ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందనేది కూడా ఎంతో ముఖ్యం. తాత్కాలిక పొత్తులు ఎప్పుడూ పుట్టి ముంచేస్తాయని కాంగ్రెస్ తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు చేస్తే అనేక సీట్లు గెలిచే అవకాశం వుండేది. కాని స్దానిక రాజకీయాలకు తనను తానే బలి చేసుకుంటోంది. పొత్తు ధర్మంతో తనను తాను తగ్గించుకుంటోంది. ఇది కాంగ్రెస్‌కుతీరని అన్యాయమైపోతోంది. ఇప్పుడు బిహార్‌లోనూ అదే జరుగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ఇచ్చే సీట్ల మీద ఆదారపడడం అనేది కాంగ్రెస్‌కు ఆశని పాతంగా మారనున్నది. ఓట్ చోరీ అనే అంశాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకొచ్చి, ఎన్నికల సంఘం మీద రాహుల్ గాందీ యుద్దం చేస్తున్నారు. ప్రజలను చైతన్యం చేయడం కోసం పాదయాత్రలు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు జవసత్వాలు కల్పిస్తున్నారు. ఫలితంగా ఆ పార్టీలకు ఊపిరిపోస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఓటమి పాలైన ఆర్జేడీ ఈసారి గెలిచేందుకు రాహుల్ గాంధీ రూపంలో ఆపార్టీకి ఎంతో బలం వచ్చింది. అయినా సరే కాంగ్రెస్ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ ససేమిరా అంటోంది. ఇదిలా వుంటే బిహార్‌లో రాజకీయపార్టీని పెట్టి, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. కారణం ఆయన పార్టీకి ప్రజల నుంచి స్పందన రావడం లేదని స్పష్టమైంది. ఒక వేళ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా, తాను ఓడిపోయినా తనకు తీరని నష్టమని తెలుసుకున్నారు. పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. కాని తాను ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించలేదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాద్దతు ఎవరికి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా ఇండియా కూమిటికి సరిగ్గా ఎన్నికల సమయంలో పడుతున్న దెబ్బలు కోలుకోకుండా చేస్తున్నాయి. అయితే బిహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే మాత్రం కాంగ్రెస్‌కు ఒక రకంగా సంజీవని అవుతుందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. కాంగ్రెస్‌కు మంచి రోజులు రానున్నాయనే వాటికి సంకేతాలు అని చెప్పక తప్పదు.
