బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు కోదాటి అనిల్, రోకుల వరుణ్
బిఆర్ఎస్ లో చేరనున్న తూర్పు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆయుబ్?
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
వరంగల్ తూర్పులో నామినేషన్ల చివరి రోజున కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. కాంగ్రెస్ స్టేట్ ఓబీసీ కోఆర్డినేటర్ కోదాటి అనిల్, 13వ డివిజన్ కాంటేస్టెడ్ కార్పొరేటర్ రోకుల వరుణ్, 20వ డివిజన్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు కాంటెస్టెడ్ కార్పొరేటర్ గొల్లెన రవి, మాజీ టీపీసీసీ మెంబెర్ నరేందర్ లు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపనేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాభి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కోదాటి అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఏండ్లుగా ఉంటున్న మాకు సరియైన గుర్తింపు ఇవ్వకుండా, కొన్ని రోజుల నుండి తూర్పుకు దూరంగా ఉండి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కొండా దంపతులు కనీసం మమ్మల్ని నామినేషన్ కి కూడా పిలువకుండా అవమాన పరుచడం మాకు బాధ కలిగింది అని. నిలకడ లేని నాయకుల దగ్గర పని చేయడం మాకు అవసరం లేదని, అభివృద్ధి ప్రదాత నన్నపనేని ఆధ్వర్యంలో, బిఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకై మా వంతు కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ కూడా బిఆర్ఎస్ లోకి వస్తారని, తూర్పు కాంగ్రెస్ ఇంచార్జీ ఆయుబ్ కూడా బిఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు