పెద్ద కొడఫ్గల్ ప్రజావాణికి అధికారుల డుమ్మా
అర్జీదారుల ఇబ్బందులు
కామారెడ్డి జిల్లా /పెద్ద కొడఫ్గల్ నేటిధాత్రి :
కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసిల్దార్ దశరథ్ ఆధ్వర్యంలోప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు త్వరితంగా పరిష్కారం కావడానికి ఉన్నతాధికారులు మండల కేంద్రాలలో ప్రజావాణి ఏర్పాటు చేశారు. కానీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా గత కొన్ని వారాలుగా అధికారులు గైర్హాజరు అవుతున్నారు నేటి ప్రజావాణికి కూడా కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు అయ్యారు కొన్ని శాఖల అధికారులు రాకపోయేసరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్జీదారులు వాపోతున్నారు గైర్హాజరు అయినా అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్జిదారులు మరియు మండల ప్రజలు కోరుతున్నారు