Viral Winter Bathing Jugaad
గీజర్ కంపెనీల సేల్స్‌కు పెద్ద దెబ్బ.. వేడి నీటి కోసం ఎలాంటి ట్రిక్ కనిపెట్టాడో చూడండి..
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది (winter bathing trick).
సాధారణంగా చలికాలం వస్తే అందరూ వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. అయితే అందరి ఇళ్లలోనూ గీజర్లు ఉండవు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ వ్యక్తి తన ట్యాలెంట్‌ను ఉపయోగించాడు. ఆ వీడియోను @DashrathDhange4 అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి బాత్రూమ్ కుళాయి కింద ఖాళీ నూనె డబ్బాను ఉంచాడు. ఆ డబ్బా కింద ఉన్న పాన్‌లో నిప్పు మండుతోంది. కుళాయి నుంచి నీరు డబ్బాలో పడగానే, కింద ఉన్న మంట కారణంగా ఆ నీరు వేడుక్కుతోంది
