ప్రభుత్వ భూమిని కాపాడాలని భూపాలపల్లి ఆర్డీవో కి వినతిపత్రం.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్.

చిట్యాల, నేటి ధాత్రి ;

భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆర్డీవో ని మంగళవారం రోజున సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు కాపాడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ చిట్యాల మండలంలోని కైలాపూర్ శివారులోని 206 సర్వే నెంబర్ పదేకరల భూమి అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని జామాయిల్ చెట్లు మామిడి చెట్లు పెంచుతున్నారు తక్షణమే ఆ చెట్లను తొలగించాలని ప్రభుత్వ భూమిని కాపాడి ఆక్రమించుకున్న వారి పైన చర్యలు తీసుకోవాలని భూమిలేని నిరుపేదలకు భూమిని పంచాలని వందల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది ఆ సర్వే నెంబర్లు ఉన్నటువంటి మొత్తం భూమి సర్వే నిర్వహించి అక్రమ దారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని భూములను కాపాడాలని ఆర్డిఓ కి విన్నవించడం జరిగింది తక్షణమే స్పందించిన ఆర్డీవో కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సంగీరాజు ప్రకాష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!