
భూపాలపల్లి నేటిధాత్రి
సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సహాయంతో భూపాలపల్లి పోలీసులు పోగొట్టుకున్న సెల్ ఫోను లను తక్కువ సమయంలో బాధితులకు అప్పగించారు. 1)తాళ్లపల్లి లింగస్వామి,2)గురుకుంట్ల దేవేందర్,3)కరుణ రాజశేఖర్ , 4)తన్నీరు మాధవ,5) పడాల వినోద్ అను వారి సెల్ ఫోన్ లు మిస్సవ్వగా, అట్టి వివరాలు CEIR PORTAL ద్వారా సెల్ ఫోన్ నెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులో వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందుపరిచి పై ఐదుగురి ఫోన్లు రికవరీ చేసి వారికి అందించడం జరిగింది
ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తమ సెల్ఫోన్ పోగొట్టుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే CEIR PORTAL ద్వారా మొబైల్ కు సంబధిత వివరాలు www.ceir.gov.in వెబ్సైటులో వెళ్లి అందులో పూర్తిగా వివరాలు నమోదు చేసిన తరువాత వారి సెల్ఫోన్ ను పట్టుకోవడం జరుగుతుందని, ఈ సాంకేతికతను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.